Google People Card in Telugu: మనం Visiting Cards గురించి వింటూనే ఉంటాం, అందులో మన పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి, వెబ్సైట్, చిరునామా మొదలైన సమాచారం కలిగి ఉంటుంది. ఈ కార్డును మనం కొత్త మనుషులు కలిసినప్పుడు ఇస్తుంటాం, ఎందుకంటే వారు మరలా మనల్ని Contact చేయడానికి. అయితే ఈ పద్ధతి ఇప్పుడు పాతదవ్వపోతుంది, ఎందుకంటే నేటి కాలంలో ప్రతి మనిషి యొక్క Contact details ఆన్లైన్లోఅందుబాటులోకి ఉంటున్నాయి. Facebook, Instagram లాంటి సోషల్ మీడియా పేజీలలో మనకు కావలసిన మనిషి పేరుతో శోధన చేస్తే మనకు వారు కనబడతారు. అయితే రానున్న రోజుల్లో ఇది మరింత సులభతరం కానుంది.
ఎవరైనా popular వ్యక్తుల గురించి మనం Internet లో సెర్చ్ చేస్తే మనకు వారి వివరాలు Wikipedia లేదా ఇతర Websites అందుబాటులోకి తెస్తాయి. అయితే సామాన్య జనానికి ఇది సాధ్యం కాదు. అయితే సామాన్య వ్యక్తి కూడా ఇలాంటి సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది గూగుల్ సంస్థ.
Google People Card in Telugu | Online Virtual Visiting Cards
ప్రపంచంలోని అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ Google తమ వినియోగదారు కొత్త రకం అనుభవాన్ని అందించడానికి వర్చువల్ విజిటింగ్ కార్డ్ పేరుతో ఒక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని Google "People Card" అని కూడా పిలుస్తారు. ప్రజలు ఈ వర్చువల్ విజిటింగ్ కార్డు ద్వారా తమ యొక్క వివరాలను Online లో పొందుపరచవచ్చు. తద్వారా ఒకరి పేరు Google లో Search చేయడం ద్వారా వారి యొక్క వివరాలు తెలుస్తాయి. పీపుల్ కార్డ్ అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.గూగుల్ పీపుల్ కార్డ్ అంటే ఏమిటి? | Google People Card in Telugu
గూగుల్ పీపుల్ కార్డ్ అనే క్రొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, దీని ద్వారా ఇంటర్నెట్ వినియోగదారులు గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి వారి స్వంత విజిటింగ్ కార్డ్‌ను సృష్టించవచ్చు. పీపుల్ కార్డ్ అనేది ఆన్లైన్ విజిటింగ్ కార్డ్, ఇది ప్రజలు వారి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేందుకు దోహదపడుతుంది. అంతేకాక Google శోధనలో, మీ యొక్క వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ప్రొఫైల్‌ను హైలైట్ చేయవచ్చు. ఇది Business చేసేవారికి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కు, వర్కర్స్, ఇలా అందరికీ ఉపయోగబడే అంశమే..!Google పీపుల్ కార్డ్ ఎందుకు?
ఒక Business కు సంబందించిన contact details ఎలా అయితే అందరికీ తెలిసేలా Online లో అందుబాటులో వుంచుతామో, ఒక వ్యక్తికి సంబంధించి వివరాలు కూడా ఇలాగే పెట్టొచ్చు. దీని లక్ష్యం ఏమిటంటే Workers, Freelancers కొత్త వ్యాపారవేత్తలు వంటి వారు తమ వేదికను లక్షలాది మందితో ఒకే చోట పంచుకోగలిగే అవకాశం కలుగుతుంది. తద్వారా Online నుంచి Orders లేదా Offers వచ్చే అవకాశం మెరుగవుతుంది.Google Virtual Visiting Cards ఎవరు పొందవచ్చు?
- ఎవరైతే ఈ Google Virtual Visiting Card ప్రయోజనాన్ని పొందాలి అనుకుంటున్నారో వారికి తప్పనిసరిగా గూగుల్ లో ఒక ఖాతా కలిగి ఉండాలి. అంటే Gmail ID ఉన్న వ్యక్తి ఈ పీపుల్ కార్డు సౌకర్యాన్ని పొందొచ్చు.
- భారతదేశంలో నివసించే ప్రజలు మాత్రమే పీపుల్ కార్డు పొందవచ్చు
- మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి
- పీపుల్ కార్డు నమోదు చేసుకునే వారు ఆండ్రాయిడ్, ఐఫోన్ లేదా ఐప్యాడ్ లాంటి smart phone ద్వారా మాత్రమే చేయగలరు
Google పీపుల్ కార్డ్ ఎలా Create చేయాలి?
- మొదట Google Chrome నుంచి మీ Gmail అకౌంట్ లోకి Logon అవ్వండి
- తరువాత క్రోమ్ లో google.com లింక్‌ను తెరవండి.
- ఇక్కడ, "Add Me To Search" అని టైప్ చేసి ఎంటర్ చేయండి, ఇక్కడ వచ్చే మొదటి లింక్‌పై క్లిక్ చేయండి.
- క్రొత్త పేజీ తెరవబడుతుంది, ఇక్కడ మీరు మీ Gmail ఖాతా యొక్క ఫోటోను చూడవచ్చు. ఇక్కడ మీరు మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. తరువాత, 6-అంకెల OTP మీ మొబైల్ కు వస్తుంది.
- ఇప్పుడు మీరు ఇతరులతో పంచుకోవాలనుకునే సమాచారాన్ని నమోదు చేయండి.
- మీ వ్యాపారం, కంపెనీ పేరు, చిరునామా, విద్య గురించి సమాచారం ఇవ్వండి.
- మీ Details ఇచ్చిన తర్వాత, మీరు దాన్ని preview రూపంలో చూడవచ్చు. ఒకసారి సరిచూసుకుని, మీరు దాన్నిSubmit చేయండి.
- అంతే, మీ పీపుల్ కార్డ్ Online లోకి అందుబాటులోకి వస్తుంది, మీ పూర్తి పేరు టైపు చేసిన వారికి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మీ Contact details అలాగే మీరు నమోదు చేసిన ఇతర వివరాలు కనబడతాయి..