How To Create a Blog (Blogger Tutorial in Telugu): ఒక బ్లాగు ని create చేయడానికి మనకి Online లో చాలా వేదికలు మరియు పరికరాలు అందుబాటులో వున్నాయి. వాటిని ఉపయోగించుకుని ఉచితంగా లేదా డబ్బు చెల్లించి Telugu Blogs మొదలుపెటొచ్చును. ఈ పేజీ లో మీరు బ్లాగు ను నెలకొల్పడానికి కావలసిన విషయాలను గురించి తెలుసోకోవచ్చును.
Blog Meaning in Telugu / బ్లాగ్ అంటే ఏమిటి?ఒక వ్యక్తి లేదా చిన్న సమూహం చేత Online వేదికగా క్రమం తప్పకుండా వాడుక భాషలో వ్రాయబడే ఒక అనధికారిక సంభాషణల యొక్క పర్వం.
How To Create a Blogger Blog and Make Money in Telugu?
Best Blogging Platforms (ఉత్తమ బ్లాగింగ్ వేదికలను ఎలా ఎంచుకోవాలి): Online వేదికగా బ్లాగర్స్ కోసం చాలా Blogging Platforms అందుబాటులో వున్నాయి. అందులో చాలా వరకు ఉచితంగా సేవలను అందిస్తుంటే కొన్ని వాటికి మాత్రం డబ్బు చెల్లించవలసిన అవసరం వుంది. ఏది ఏమైనా తెలుగులో లేదా ఇంగ్లీష్ లో ఒక బ్లాగ్ ఉచితంగా మొదలుపెట్టవచ్చు లేదా కనీసంగా ఒక 500 నుంచి 3000 వున్నా సరిపోతుంది. ఉచితంగా సేవలు అందించే బ్లాగింగ్ వేదికలు ఏంటో ఇక్కడ చూద్దాం.Free and Best Blogging Platforms for Telugu Bloggers
క్రింద కనిపిస్తున్న Online Blogging వేదికల ద్వారా మీరు తెలుగులో బ్లాగ్ ఉచితంగా మొదలుపెట్టవచ్చును. ఇలాంటి వేదికలు ఇంకా చాలా వున్నాయి. అందులో ఉత్తమ Blogging Platforms మాత్రం ఇవ్వబడినది.- Blogger
- Tumblr
- Wordpress
- Medium
- Wix
- Strikingly
- Joomla
- Webnode
- Weebly
Blogger Tutorial in Telugu | ఉచితంగా బ్లాగ్
మీకు Gmail account ఉంటే చాలు. మీరు ఉచితంగా ఒక బ్లాగ్ create చేసుకోవచ్చు మరియు దాని ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. దీనికి మీరు కింద కనపడుతున్న లింక్ ద్వారా మొదటగా రిజిస్టర్ చేసుకోవలెను.Blogger Link: https://www.blogger.com
ఒక బ్లాగ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అసలైన పని ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఎవరైతే సొంతగా కంటెంట్ క్రమం తప్పకుండా పెడుతూ పెద్ద సంఖ్యలో రీడర్స్ లేదా subscribers ను సంపాదించుకుంటారో వారికి గూగుల్ బ్లాగర్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని కలిగిస్తుంది.
గూగుల్ ద్వారా బ్లాగర్ బ్లాగ్ సృష్టించిన తరువాత మీరు క్రింద విదంగా చేయవలసి వుంటుంది.
- బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత About Us, Contact Us, Privacy Policy, Disclaimer వంటి పేజీలను తప్పనిసరిగా పబ్లిష్ చేయవలెను
- ముందుగా మీకు సముచితమైన లేదా ఇష్టమైన టాపిక్స్ ను ఎంచుకోండి (ఉదాహరణ: Cricket, Jobs, Travelling, etc.)
- మీకు ఇష్టమైన టాపిక్ మీద కనీసం ఒక 30 పోస్ట్లు కోసం కంటెంట్ ని ముందుగానే సిద్ధం చేయండి.
- రోజువారీ ఆ టాపిక్ మీద ఒక పోస్ట్ ను పబ్లిష్ చేయండి
- ప్రతి పోస్ట్ లో కనీసం ఒక Image పెట్టండి
- మీరు పబ్లిష్ చేసిన కంటెంట్ మరియు Images వేరే బ్లాగ్స్ నుంచి copy చేసింది అయి వుండకూడదు. మీరు సొంతగా వ్రాయాయవలెను.
- మీ పోస్టులను సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేయండి
- ఇలా ఒక 30 రోజులు చేసిన తర్వాత Google Adsense కి apply చేయండి.
- మీ బ్లాగ్ కి వస్తున్న ట్రాఫిక్ లేదా రీడర్స్ ను బట్టి మీకు గూగుల్ డబ్బు చెల్లిస్తుంది.