Jagan Navaratnalu in Telugu (జగన్ నవరత్నాలు తెలుగులో)

Jagan Navaratnalu in Telugu: 2019 మే నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి వెనువెంటనే నవరత్నాలను అమలు చేయటం మొదలు పెట్టారు. దాదాపు అన్ని పథకాలను 2020 జనవరి నెలకు విడతలవారీగా పూర్తి చేయగలిగారు. ప్రతి ఇంటికి నవరత్నాలు పేరిట ప్ర్రారంభమైన ఈ పధకాలు జనాల యొక్క మన్నలను ఎంతగానో పొందాయి. ఈ నవరత్నాల పథకాల ద్వారా, కుటుంబంలో వుండే ప్రతి ఒక్కరు సహాయం పొందగలుగుతారు. స్కూల్ పిల్లలు అమ్మ ఒడి రూపంలో, వయసు పైబడిన వారు పెన్షన్ రూపంలో,  ఒక ఇంట్లో ఎవరైనా అనారోగ్యులు ఉంటే వారు ఆరోగ్యశ్రీ రూపంలో, రైతులు వైయస్ఆర్ రైతు భరోసా రూపంలో, స్త్రీలు వైయస్ఆర్ ఆసరా రూపంలో, ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందేలా ఈ నవరత్న పథకాలను తీర్చిదిద్దటం జరిగింది.

jagan-navaratnalu-list-jagan-manifesto

Jagan Navaratnalu in Telugu 2020 (జగన్ నవరత్నాలు తెలుగులో)

వైయస్ఆర్ రైతు భరోసా (Pillar of YSRCP Navaratnalu)

 • ప్రతి రైతు కుటుంబానికి ప్రతి యేటా రూ.13500 పెట్టుబడి కోసం ఇస్తారు. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్ అందించడం, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ టాక్స్ మాఫి ఇందులో వర్తించే అంశాలే. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాది నుంచి మే నెలలో పెట్టుబడి కోసం ఏడాదికి రూ.13,500 చొప్పున వరుసగా ఐదేళ్లు అందించటం జరుగుతుంది .

 • వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్ కు రూ.1.50కు తగ్గించటం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు.

 • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైతే ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయటం. సహకార రంగాన్ని పునరుద్ధరించి

 • సహకార డైరీలకు పాలుపోసే పాడి రైతులకు లీటర్ కు రూ.4 సబ్సిడీ ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు "వైయస్ఆర్ బీమా" ద్వారా రూ.5 లక్షలు చెల్లించటం జరుగుతుంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్

 • పేదవారి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది.

 • దీనితోపాటు అదనంగా విద్యార్థులకు వసతి, భోజనం కోసం ఏటా అదనంగా రూ. 20 వేలు ప్రతి విద్యార్థికి ఇస్తారు.

 • దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది.

వైయస్ఆర్ ఆసరా

 • ఈ పథకం కింద ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికే నేరుగా అందిస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు.

 • ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది.

 • అదేవిధంగా "వైయస్ఆర్ చేయూత" ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు.

ఆరోగ్యశ్రీ (YSRCP Navaratnalu in Telugu)

 • వార్షిక ఆదాయం రూ.5,00,000 దాటని అన్ని వర్గాల వారికీ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు.

 • ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిస్తారు.

 • హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను దీని పరిధిలోకి వస్తాయి.ఆపరేషన్ చేయించుకున్న లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక చేయూతనందిస్తారు.

 • కిడ్నీవ్యాధి, తలసేమియాతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తారు.

పేదలందరికీ ఇళ్లు

 • ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది లక్ష్యం.

 • ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు.

 • ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుంది.

పింఛన్ల పెంపు

 • ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.27,000 నుంచి రూ.36,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది.

 • ప్రస్తుతం పింఛన్ తీసుకోవడానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించడం జరిగింది.

 • అవ్వతాతలకు నెలకు రూ.2500, ఇస్తూ దానిని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాము.

 • దివ్యాంగులకు రూ.3000 పింఛన్ అందిస్తున్నారు.

అమ్మఒడి

 • పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తారు.

 • ఈ పధకం లక్ష్యం ప్రతి తల్లి తన పిల్లలను సంతోషంగా బడికి పంపడం ద్వారా వారి భవిష్యతుకి బంగారు బాట వేయుదము.

జలయజ్ఞం

 • లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది.

 • పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతుల లోగిళ్లలో సిరులు నింపుతారు

మద్యంపై నిషేధం

 • మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి

 • మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేయడం.
SeeCloseComments