OTT Platform in Telugu: Lockdown తరువాత దేశంలో అన్ని కంపెనీలు మూతపడ్డాయి, వ్యాపారలావాదేవీలు కుదేలయ్యాయి, అయినా గత కొద్ది నెలలుగా ఇండియాలో బూమ్ మీదున్న Business ఏదన్నా ఉందా అంటే అది OTT రంగమే. ఇంటర్నెట్ ఈ సమయంలో చాలా రంగాలని ఆదుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కేవలం Internet మీద ఆధారపడిన Digital Media గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే ఈ ఓటీటీ గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు, మొబైల్ ఫోన్లోనే సినిమాలు, వినోద కార్యక్రమాలు, Live ప్రసారాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటువంటి అధునాతన పరిస్థితిలో, ఈ టెలివిజన్ కార్యక్రమాలు నుంచి వెబ్ సిరీస్ వైపుకు జనాలు చూపు మళ్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.ఈ పరిణామాలను కారణంగానే OTT ప్లాట్‌ఫారమ్‌లు వెలిచాయి.
Read: Upcoming Telugu Movies in OTT
What is OTT Platform in Telugu? డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్
OTT అంటే ఇంటర్నెట్ మీద ఆధారపడి వీడియో లేదా ఇతర మీడియా సంబంధిత కంటెంట్‌ను ప్రదర్శించే ఓవర్-ది-టాప్ ప్లాట్‌ఫాం. దీనిని వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫాం, OTT Platform Service, digital streaming platform అని కూడా పిలుస్తారు. OTT (Over-The-Top) ప్లాట్‌ఫాంకు ప్రజాదరణ మొదట US లో పెరిగింది, ఆ తరువాత అది క్రమేపి అన్నిదేశాలకు వ్యాపించింది. ఇందులో Television shows తో పాటుగా చలనచిత్రాలు, Web Series ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోడానికి వినియోగదారులు ఈ OTT ప్లాట్‌ఫామ్‌లకు నెలసరి లేదా ఒక సంవత్సరానికి Subscription plan తీసుకోవాలి. అయితే, వాటి రుసుము చాలా తక్కువే అని చెప్పాలి.Types of OTT Platforms in Telugu
Transactional Video on Demand (TVOD): OTT ప్లాట్‌ఫాంలో ఒక రకమైన ఈ టీవీఓడీ సేవ వినియోగదారులు తమ అభిమాన టెలివిజన్ షో లేదా చలనచిత్రాలను ఒకసారి చూడాలనుకుంటే, వారు దానిని Rentకు తీసుకుని చూడవచ్చు, లేదా పూర్తిగా కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, ఆపిల్ ఐట్యూన్స్, YouTube Movies మొదలైనవి. Subscription Video on Demand (SVOD): మీరు వీడియో స్ట్రీమింగ్ కంటెంట్‌ను చూడాలనుకుంటే, దాని కోసం నెలకు లేదా సంవత్సర కాలానికి సభ్యత్వాన్ని పొందాలి. మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ కస్టమర్లు వుంది SVOD platform కే అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వీడియో మొదలైనవి.Advertising Video on Demand (AVOD): ఈ OTT సేవలో ప్రకటనలు ఎక్కువగా వస్తాయి. దీనిలో, కస్టమర్లు కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు, కానీ ఈ కంటెంట్ తో పాటుగా మధ్య మధ్యలో Ads చూడాలి. ఉదాహరణకు చెప్పాలంటే YouTube, MX Player, మొదలైనవి..OTT ప్లాట్‌ఫాం సేవల ప్రయోజనాలు
- టీవీ కార్యక్రమాలు, సినిమాలు లేదా ఇష్టమైన ప్రోగ్రామ్‌లను చూడటానికి కేబుల్ టీవీ కనెక్షన్ లేదా డిటిహెచ్ కనెక్షన్ అవసరం లేకుండా ఇంటర్నెట్ ఉపయోగించుంకుని సరాసరి తమ smartphones లో కావల్సిన వినోద కార్యక్రమాలు చూడొచ్చు.
- సరికొత్త వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు ఆయా OTT ప్లాట్‌ఫారమ్‌లకు ప్రత్యేకమైనవి, కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ అందుబాటులోకి వస్తాయి, ఇవి వేరే చోట దొరకవు. ఇవి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా వంటి కొన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు.
- కోరుకున్నప్పుడల్లా, OTT App ఉపయోగించి సరికొత్త సినిమాలు చూసే సౌలభ్యం దొరుకుంది
- Android TV, స్మార్ట్ టీవీలకు అనుసందానం చేయడం ద్వారా ఇంటిల్లిపాది కలిసి చూడొచ్చు
- ఎప్పుడు కావాలంటే అప్పుడు Subscription రద్దు చేసుకునే అవకాశం