Wednesday, 20 January 2021

What is Web hosting in Telugu వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?

Web hosting in Telugu: ఇది డిజిటల్ యుగం. ఇప్పుడు అందరూ తమ వ్యాపారాలను Online ద్వారా సేవలు అందించాలి అనుకుంటారు. అలాగే బ్లాగింగ్ మీద మక్కువ వున్నవాళ్లు తమ అభిప్రాయాలను ఆన్లైన్ వేదికల ద్వారా పంచుకోవాలని చూస్తారు. వీటన్నింటికి ఒక online application లేదా web app లేదా website అవసరం. మీ యొక్క files లేదా ఇతర డేటాను వెబ్సైటు రూపంలో పొందుపరచాలి అంటే  సర్వర్ హోస్టింగ్ తప్పనిసరి. అయితే హోస్టింగ్ అంటే ఏమిటి, హోస్టింగ్ ఎన్ని రకాలు, హోస్టింగ్ కొనే ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం.

What is web hosting in Telugu వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?

 వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?
మీ సరుకులను నిల్వ చేయడానికి మీకు ఒక గది లేదా స్థలం అవసరం ఉన్నట్లే, ఒక వెబ్‌సైట్‌ నిర్వహించాలంటే ఆన్‌లైన్‌లో వెబ్ హోస్టింగ్ అవసరం.

సింపుల్ గా చెప్పాలి అంటే - "వెబ్ హోస్టింగ్ మీ వెబ్‌సైట్ యొక్క డేటా ఫైల్‌లను online servers లో భద్రపరుస్తుంది". ఆ సర్వర్స్  ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ముఖ్యం.

వెబ్ హోస్టింగ్ ఎలా పని చేస్తుంది?

హోస్టింగ్ కంపెనీస్ మీ వెబ్‌సైట్ ఫైల్‌లను వెబ్ సర్వర్‌లలో నిల్వ చేస్తాయి. మీ వెబ్‌సైట్‌ను చూడటానికి ఎవరైనా వారి బ్రౌజర్‌లో URL ను టైపు చేసినప్పుడు, ఈ వెబ్ సర్వర్లు క్లయింట్ నుండి ఒక అభ్యర్థనను అంగీకరిస్తాయి మరియు మీ వెబ్‌సైట్ ఫైళ్ళ కాపీని వారి కంప్యూటర్‌కు పంపుతాయి, దాని ఫలితంగా మీ వెబ్‌సైట్  అంతర్జాలంలో అందుబాటులో ఉంటుంది.

వెబ్ హోస్టింగ్ కొనే ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు

  • మీ హోస్టింగ్ సర్వీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి, అంటే servers యొక్క up time గురించి తెలుసుకోవాలి

  • సర్వర్స్ యొక్క డేటా సెంటర్స్ లొకేషన్ మీ టార్గెట్ ఆడియన్స్ కు దగ్గర్లో ఉండటం మంచిది. అనగా మీ బ్లాగు భారతీయులకే పరిమితం అయితే, మీ బ్లాగు యొక్క వెబ్ హోస్టింగ్ కూడా భారత దేశంలో తీసుకోవటం మంచిది. దీని వల్ల latency తగ్గుతుంది

  • కొన్ని సార్లు మీ సర్వర్స్ యొక్క స్పీడ్ మీ బ్లాగు యొక్క ర్యాంకింగ్స్ ను పెంచుతుంది. కాబట్టి స్పీడ్ ఎక్కువ ఇచ్చే హోస్టింగ్ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి

  • మీ వెబ్ హోస్టింగ్ కంపెనీ  24/7 సపోర్ట్ ఇస్తుందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీ సర్వర్స్ down అయితే మీరు కాల్ చేసి కనుక్కునేలా ఉండాలి

  • వెబ్ హోస్టింగ్ కంపెనీల యొక్క రివ్యూస్ చదవటం మంచిది

  • అలాగే Online లో అందుబాటులో వుండే టూల్స్ ఉపయోగించి నేరుగా మీరే speed test, latency test వంటి సర్వర్ సంబంధిత విషయాలు తెలుసుకోవచ్చు

Types of Web Hosting in Telugu వెబ్ హోస్టింగ్ ఎన్ని రకాలు?

వెబ్ హోస్టింగ్ పరిశ్రమలో వివిధ రకాల హోస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి
  • Shared Server Hosting

  • WordPress హోస్టింగ్

  • డెడికేటెడ్ హోస్టింగ్

  • క్లౌడ్ హోస్టింగ్

  • వర్చువల్ ప్రైవేట్ సర్వర్ (VPS) హోస్టింగ్
మీరు ఏ రకమైన హోస్టింగ్ తీసుకోవాలి అనేది మీ వెబ్‌సైట్ యొక్క అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వెబ్‌సైట్ యొక్క వ్యాపారం, లావాదేవీలు, అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఆయా అవసరాల దృష్ట్యా మీ హోస్టింగ్ ఎంచుకోవాలి.

ఉదాహరణ: చిన్న వెబ్సైటు shared హోస్టింగ్ తో మొదలైతే, వ్యాపార రంగంలో వుండే వెబ్సైట్లు VPS హోస్టింగ్ సేవలు ఎంచుకుంటాయి.
what-is-web-hosting-in-telugu