YS Rajasekhara Reddy Life History in Telugu: తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన నాయకులు చాలా తక్కువ మందే వున్నారు. అందులో ప్రముఖులు శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. ఎన్టీఆర్ తరువాత రాజకీయాలలో తన మార్కు పాలన చూపించింది స్వర్గీయ రాజశేఖరరెడ్డి ఒక్కరే. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పటికీ, జనాలు మాత్రం అది రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనే వారు. అంతగా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
YS Rajasekhara Reddy Life History in Telugu
2004-2009 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల జీవితాలలో చెరగని ముద్ర వేశారు. 2003లో దాదాపు 1467 కి.మీ. దూరం రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.Dr.YS Rajasekhara Reddy Birth and Education
వైయస్ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న జయమ్మ, రాజారెడ్డి దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు.కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదివారు. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు.
రాజకీయాల్లోకి రాక ముందు వైఎస్ 1973లో తన తండ్రి పేరిట 70 పడకల చారిటబుల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు
YS Rajasekhara Reddy Family
డా. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇద్దరు సంతానం, వారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు, షర్మిల వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.Political Career
- వైయస్ 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది.
- 1983లో తొలిసారి పీసీసీ చీఫ్గా ఎన్నికయ్యారు. తర్వాత 1998లో మళ్లీ పీసీసీ అధ్యక్షుడయ్యారు.
- వైయస్ రాజశేఖర రెడ్డి 1999 నుంచి 2004 వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.
Padayatra
ఎన్నికల ముందు 2003లో మండు వేసవిలో వైయస్ 1467 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర మొదలైంది. వైయస్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది.CM of Andhra Pradesh
- వైయస్ పాదయాత్ర కారణంగా 2004 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మే 14న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సమస్యలు చూసి చలించిపోయిన ఆయన.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు.
- వైయస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో 2009లో మరోసారి ఆయన సీఎంగా ఎన్నికయ్యారు.