Wednesday, 31 March 2021

What is OTT Platform in Telugu? డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్

OTT Platform in Telugu: Lockdown తరువాత దేశంలో అన్ని కంపెనీలు మూతపడ్డాయి, వ్యాపారలావాదేవీలు కుదేలయ్యాయి, అయినా గత కొద్ది నెలలుగా ఇండియాలో బూమ్ మీదున్న Business ఏదన్నా ఉందా అంటే అది OTT రంగమే. ఇంటర్నెట్ ఈ సమయంలో చాలా రంగాలని ఆదుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కేవలం Internet మీద ఆధారపడిన Digital Media గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే ఈ ఓటీటీ గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 

what-is-ott-platform-in-telugu

ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు, మొబైల్ ఫోన్‌లోనే సినిమాలు, వినోద కార్యక్రమాలు, Live ప్రసారాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటువంటి అధునాతన పరిస్థితిలో, ఈ టెలివిజన్ కార్యక్రమాలు నుంచి వెబ్ సిరీస్ వైపుకు జనాలు చూపు మళ్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.ఈ పరిణామాలను కారణంగానే OTT ప్లాట్‌ఫారమ్‌లు వెలిచాయి.

Read: Upcoming Telugu Movies in OTT Platform 2021

What is OTT Platform in Telugu? డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్

OTT అంటే ఇంటర్నెట్ మీద ఆధారపడి వీడియో లేదా ఇతర మీడియా సంబంధిత కంటెంట్‌ను ప్రదర్శించే ఓవర్-ది-టాప్ ప్లాట్‌ఫాం. దీనిని వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫాం, OTT Platform Service, digital streaming platform అని కూడా పిలుస్తారు. OTT (Over-The-Top) ప్లాట్‌ఫాంకు ప్రజాదరణ మొదట US లో పెరిగింది, ఆ తరువాత అది క్రమేపి అన్నిదేశాలకు వ్యాపించింది. ఇందులో Television shows తో పాటుగా చలనచిత్రాలు, Web Series ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోడానికి వినియోగదారులు ఈ OTT ప్లాట్‌ఫామ్‌లకు నెలసరి లేదా ఒక సంవత్సరానికి Subscription plan తీసుకోవాలి. అయితే, వాటి రుసుము చాలా తక్కువే అని చెప్పాలి.

మీరు సంవత్సర కాలంలో 1000 రూపాయల కంటే తక్కువలో వందల సంఖ్యలో కొత్త సినిమాలు, Shows, వెబ్ సిరీస్ మరియు ఇతర కార్యక్రమాలు చూడొచ్చు.మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, కరోనావైరస్ వల్ల లాక్డౌన్ రావడంతో, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మళయాళ సినిమాలను ఈ OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేస్తున్నారు. మరో వైపు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాటుఫార్మ్స్ కు Tamilrockers లాంటి పైరసీ సైటుల వల్ల వీక్షకుల సంఖ్య తగ్గడం బాధాకరం.

Types of OTT Platforms in Telugu

Transactional Video on Demand (TVOD): OTT ప్లాట్‌ఫాంలో ఒక రకమైన ఈ టీవీఓడీ సేవ వినియోగదారులు తమ అభిమాన టెలివిజన్ షో లేదా చలనచిత్రాలను ఒకసారి చూడాలనుకుంటే, వారు దానిని Rentకు తీసుకుని చూడవచ్చు, లేదా పూర్తిగా కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, ఆపిల్ ఐట్యూన్స్, YouTube Movies మొదలైనవి.  Subscription Video on Demand (SVOD): మీరు వీడియో స్ట్రీమింగ్ కంటెంట్‌ను చూడాలనుకుంటే, దాని కోసం నెలకు లేదా సంవత్సర కాలానికి సభ్యత్వాన్ని పొందాలి. మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ కస్టమర్లు వుంది SVOD platform కే అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వీడియో మొదలైనవి.Advertising Video on Demand (AVOD): ఈ OTT సేవలో ప్రకటనలు ఎక్కువగా వస్తాయి. దీనిలో, కస్టమర్‌లు కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు, కానీ ఈ కంటెంట్‌ తో పాటుగా మధ్య మధ్యలో Ads చూడాలి. ఉదాహరణకు చెప్పాలంటే YouTube, MX Player, మొదలైనవి..

OTT ప్లాట్‌ఫాం సేవల ప్రయోజనాలు

  • టీవీ కార్యక్రమాలు, సినిమాలు లేదా ఇష్టమైన ప్రోగ్రామ్‌లను చూడటానికి కేబుల్ టీవీ కనెక్షన్ లేదా డిటిహెచ్ కనెక్షన్ అవసరం లేకుండా ఇంటర్నెట్ ఉపయోగించుంకుని సరాసరి తమ smartphones లో కావల్సిన వినోద కార్యక్రమాలు చూడొచ్చు.
  • సరికొత్త వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు ఆయా OTT ప్లాట్‌ఫారమ్‌లకు ప్రత్యేకమైనవి, కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ అందుబాటులోకి వస్తాయి, ఇవి వేరే చోట దొరకవు. ఇవి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా వంటి కొన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు.
  • కోరుకున్నప్పుడల్లా, OTT App ఉపయోగించి సరికొత్త సినిమాలు చూసే సౌలభ్యం దొరుకుంది
  • Android TV, స్మార్ట్ టీవీలకు అనుసందానం చేయడం ద్వారా ఇంటిల్లిపాది కలిసి చూడొచ్చు
  • ఎప్పుడు కావాలంటే అప్పుడు Subscription రద్దు చేసుకునే అవకాశం

Popular OTT Platforms in Telugu

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన OTT ప్లాట్‌ఫాంలు - 

Disney+ Hotstar: డిస్నీ యాజమాన్యంలోకి విలీనమైన ఈ భారతీయ OTT ప్లాట్‌ఫారమ్ 400 మిలియన్లకు పైగా నెలవారీ active వినియోగదారులను కలిగి ఉంది. లైవ్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ మరియు Bigg Boss వంటి షోలను ప్రదర్శించడం ద్వారా ఇది చాలా ప్రాచుర్యం పొందింది.

Netflix: 2016 లో మన దేశానికి వచ్చి అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్. ఇది అత్యంత ప్రజాదరణ పొందడానికి కారణం చౌకైన Subscription plans, రియాలిటీ టీవీ సిరీస్, Web Series, Originals.


Amazon Prime Video: భారతదేశంలో అత్యంత popular ఓటీటీలో ఇదొకటి. మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉంటూ వస్తుంది. దక్షిణ భారతంలో No.1 అని చెప్పడంలో సందేహం లేదు. 


Alt Balaji: ఇది భారతీయ సంస్థ, Bollywood  filmmaker ఏక్తా కపూర్ యొక్క బాలాజీ టెలిఫిల్మ్స్ స్థాపించిన ఓటీటీ, అయితే ఇందులో ఎక్కువగా హిందీ వినోద కార్యక్రమాలు నడుస్తాయి. 

SonyLiv: సోనీ 2013 లో తన స్వంత OTT సేవను ప్రారంభించి, స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఈ మధ్యనే 100 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. ఇందులో Live TV channels చూడవచ్చు. 

ZEE5: ఈ ఓటిటి ప్లాట్‌ఫాం 2018 సంవత్సరంలో ప్రారంభించబడింది. ZEE Network కు సంబందించిన టీవీ చానెల్స్ తో పాటుగా Originals, సినిమాలు చూడవచ్చు. 

Voot: Viacom 18’s Voot, 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది, ఇందులో అనేక టీవీ కార్యాక్రమాలు, మనం మిస్సయిన సీరియల్స్ చూడొచ్చు. ఇదొకో పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం. 

MX Player: టైమ్స్ ఇంటర్నెట్ మద్దతు ఉన్న MX ప్లేయర్, ఒక Free video streaming platform. 

SUN NXT: SUN నెట్వర్క్ గ్రూప్ ప్రారంభించిన ఈ ఓటీటీ South India లో బాగా పాపులర్. ఎందుకంటే వారికి ఇక్కడ చాలా టీవీ చానెల్స్ వున్నాయి. ఎక్కడా దొరకనాన్ని సినిమాలు ఇక్కడ చూడొచ్చు. తెలుగు సినిమాలకు ఇదొక మంచి ఓటీటీ అని చెప్పొచ్చు. 

Aha Video: సినీ నిర్మాత అల్లు అరవింద్ 2020లో ప్రారంభించిన ఈ ఓటీటీ Lockdown సమయంలో అందరికీ వినోదాన్ని పంచుతూ దూసుకుపోతుంది. ఇది తెలుగుకు ప్రత్యేకమైన ఓటీటీ.

Tuesday, 16 February 2021

Best Mahatma Gandhi Quotes in Telugu (మహాత్మా గాంధీ సూక్తులు)

జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులు: No need any special introduction for Mahatma Gandhi. However, we need to remember him in our daily lives Since we are enjoying the freedom with his freedom struggle. He was born in Porbandar, Gujarat on 2nd October 1869. He played the most crucial role in the freedom struggle of India and he is the one who lead Indians during the freedom struggle.

Best Mahatma Gandhi Quotes in Telugu

Unlike other freedom fighters, His powerful political weapons were Satyagraha and non-violence that inspired every political leaders around the world. Moreover, He inspired Indian people with his sayings and valuable quotes during his entire life. Here in this article, you will be finding some of the Best Inspirational and Famous Mahatma Gandhi Quotes in Telugu.

Best Mahatma Gandhi Quotes in Telugu (మహాత్మా గాంధీ సూక్తులు)

  1. అహింసకు మించిన ఆయుధం లేదు.
  2. ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు. 
  3. ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో.. ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో
  4. కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.
  5. మీరు రేపే చనిపోతారు అన్నట్లుగా బ్రతకండి. శాశ్వతంగా జీవిస్తారు అన్నట్లుగా తెలుసుకోండి.
  6. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు.. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాందించు
  7. తక్కువ సంపాదించేవారి కన్నా, తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
  8. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం
  9. ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొనితెచ్చుకున్నట్లే.
  10. అహింస ఎదుట హింసవలె, సత్యము ఎదుట అసత్యం శాంతించాలి
  11. జీవితం అంటే విశ్రాంతి కాదు, చైతన్యం. అందుకే జీవితమంతా ఆచరణ, ఆచరణ, ఆచరణ.
  12. పుస్తకం గొప్పతనం అందులోని విషయాలపై ఆధారపడదు. అది మనకు అందించే వినూత్న ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది
  13. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది.
  14. అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే మేలు.
  15. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది. కృషితో మనం సంపాదించుకునేది శాశ్వతం.
  16. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నువ్వు చేసిన చిన్న తప్పును కూడా కొండంత తప్పుగా భావించు.
  17. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
  18. ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కానీ కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు.
  19. సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే.. సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు
  20. మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి.. వీటిని అదుపులో పెట్టడానికి కొండంత సహనం కావాలి
  21. లేని గొప్పదనం ఉందని చెబితే… ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది.
  22. నన్ను స్తుతించే వారికంటే కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా లబ్ధి పొందుతా
  23. అందం అనేది నడవడికలో ఉంటుంది. ఆడంబరాలలో కాదు.
  24. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.
  25. మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే
  26. ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి
  27. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలి పోయేది కాదు.. అది అచంచలమైనది. హిమాలయాలంత స్థిరమైనది
  28. మేధావులు మాట్లాడుతారు.. అదే మూర్ఖులైతే వాదిస్తారు
  29. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి
  30. సహాయం చేస్తే మరిచిపో… సహాయం పొందితే గుర్తుంచుకో.
  31. ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.
  32. చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.
  33. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే.
  34. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది
  35. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం
  36. అంతరాత్మ ‘ఇది తప్పు’ అని చెప్పినా, ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం
  37. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది.. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది

Tuesday, 26 January 2021

Modem Vs Routers Explained in Telugu

Modem Vs Routers Difference Explained in Telugu

Internet Modem మరియు Router యొక్క వ్యత్యాసం ఏంటి? మరియు వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనే దాని పై ఇక్కడ ఇవ్వడం జరిగింది. తరచూ మనం Modem Vs Routers రెండూ ఒకటే అనుకుంటాం. అయితే ఈ రెండూ వేరు వేరు devices/ technologies అని తెలుసుకోవాలి. ఇంటర్నెట్ ను కంప్యూటర్స్ కు చేరవేయడానికి ఈ Devices మనం వాడటం జరుగుతుంది.

Modem Vs Routers Difference Explained in Telugu

Internet Modem in Telugu

మోడెమ్ అనేది Analog signals ను Digital signals గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ Device ముక్యంగా టెలిఫోన్ వైరుల నుంచి వచ్చే Analog Signals ను Digital కు అదేవిదంగా Digital Signals ను Analog Signals గా మారుస్తుంది. అయితే BSNL లాంటి networks నుంచి టెలిఫోన్ వైరుల సాయంతో వచ్చే ఇంటర్నెట్ కు మాత్రం ఇప్పటికీ మనం మోడెమ్స్ వాడటం జరుగుతుంది. అయితే ఈ కాలంలో టెలిఫోన్ వైరుల ద్వారా వచ్చే ఇంటర్నెట్ కనెక్షన్ కు Modem అలాగే Router కలిపి ఒకే device లో ఉంటున్నాయి. 

ఇది పాత పద్ధతి అని చెప్పవొచ్చు. ఇప్పుడు వస్తున్న ఇంటర్నెట్ కేబుల్స్ డైరెక్ట్ గా డిజిటల్ సిగ్నల్స్ ను మన ఇంటికి చేరవస్తున్నాయి. కాబట్టి మోడెమ్ యొక్క ఉపయోగం తగ్గిపోయింది. 

Router Explained In Telugu

Router అనేది డిజిటల్ signal ను విభజించి వేరు వేరు devices కు చేరవేస్తుంది. ఒక ఇంటిలో ఎనిమిది మంది ఒకేసారి వేరు వేరు Devices నుంచి ఇంటర్నెట్ వాడుతున్నారు అంటే ఆ ఇంట్లో Router వుంది అనేది మనం అర్ధం చేసుకోవాలి. దీనినే మనం Wifi Router అని కూడా పిలుస్తాం. ఇది Device యొక్క IP address మీద పనిచేస్తుంది

Sunday, 24 January 2021

YSR Amma Vodi Scheme New Rules 2021, Changes In Eligibility Criteria

YSR Amma Vodi Scheme 2021 New Rules, Changes In Eligibility Criteria and many more. Rs 6,673 crore into the accounts of 44,48,865 mothers in AP

The government of Andhra Pradesh has allocated huge funds in the budget for the most ambitious Amma Vodi scheme. The government will deposit Rs 15,000 per annum in the account of every mother who sends her children to Schools. The scheme was initially introduced to students in first class to 10th class, but later extended to Intermediate. With this scheme the students who are pursuing higher education will be benefited with Rs 20,000. Overall, about Rs 6336 crore deposited in the accounts of about 43 lakh mothers in AP on January 9, 2020 last year.

YSR Amma Vodi Scheme New Rules 2021

YSR Amma Vodi Scheme New Rules 2021

The government has relaxed some of the rules in 2021 to benefit more people in Andhra Pradesh.The family income limit has been raised to Rs 10,000 per month in rural areas from Rs 5,000 Rs 12, 000 per month in urban areas from Rs 10,000 per month. Previously max two and a half acres of Magani and Five acres Metta land was extended to 3 acres Magani and 10 acres of Metta land.

  • ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ ఏడాది ప్రభుత్వం నిబంధనలు సడలించింది. కోవిడ్‌–19 పరిస్థితుల్లో విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధనకు మినహాయింపు ఇచ్చింది.
  • కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5 వేలు, పట్టణాల్లో రూ.6,250 ఉంటే, ఈ ఏడాది గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు చేశారు.
  • గతంలో రెండున్నర ఎకరాల మాగాణి, మెట్ట భూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండగా, ఈ ఏడాది మాగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు.
  • విద్యుత్‌ వినియోగానికి సంబంధించి నెలకు గతంలో 200 యూనిట్లలోపు వాడే వాళ్లను అర్హులుగా గుర్తిస్తే.. ఈ దఫా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు.
  • గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పథకాన్ని వర్తింపజేయలేదు. ఈ దఫా పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఈ ఏడాది అమ్మఒడి వస్తుంది.
  • గతంలో ఫోర్‌ వీలర్‌ (కారు) ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్న వారికే మాత్రమే మినహాయింపు నివ్వగా, ఈ దఫా ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు.
  • గతంలో మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్థిరాస్థి ఉన్న వారిని పథకంలో అర్హులుగా గుర్తించగా, ఈ దఫా 1,000 చదరపు అడుగుల స్థలం ఉన్న వారిని కూడా అర్హులుగా గుర్తిస్తున్నారు.
  • వీటన్నింటి దృష్ట్యా ఈ ఏడాది అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది. నెల్లూరులో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు జమ చేయనున్నారు.

Also, Read:

Thursday, 21 January 2021

AP Ration Door Delivery Vehicles | Benefits, Jobs, Application & More

AP Ration Door to Door Delivery Vehicles: Andhra Pradesh government has launched a new free service for white card holders. Ration card holders can avail this service absolutely free and at the same time the unemployed youth can get the jobs as Drivers and Delivery boys in the vehicles. 

Free ration delivery vehicles

ఇంటివద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను గురువారం విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలు విజయవాడ బెంజ్‌ సర్కిల్ నుంచి ఆయా జిల్లాల‌కు ప‌రుగులు తీయ‌డం క‌నుల విందుగా ఉంది. అదిగ‌దిగో..జ‌గ‌న్నాథ‌ర‌థ‌చ‌క్రాలు అంటూ రోడ్డు వెంట జ‌నం జేజేలు ప‌లుకుతున్నారు.  అన్ని జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభించారు.

How To Apply Ration Delivery Vehicles AP | Benefits, Jobs, Application & More

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం 9,260 వాహనాలు ప్రారంభించ‌డంతో ప‌ల్లెల‌ల‌కు కొత్త వాహ‌నాలు ప‌రుగులు తీస్తున్నాయి.  లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. వాహనాల ఆపరేటర్లతో పాటు నోడల్‌ వీఆర్‌వోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

AP Ration Door Delivery Vehicles

లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం - Rice Delivery

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం రంగు మారి ఉండటం, నూకల శాతం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తినేందుకు వీలుగా నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లింగ్‌ సమయంలోనే నూకలు శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు సమయ పాలన పాటించకపోవడం, సక్రమంగా అందకపోవడం, నల్లబజారుకు తరలించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే పేదలు సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మొబైల్‌ వాహనం ద్వారా ఇంటివద్దే నాణ్యమైన బియ్యం అందించే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది. బుధవారం రాత్రి విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద బారులు తీరిన రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలు

ration-delivery-vehicles

22, 23న వాహనదారులకు శిక్షణ - Training

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియాన్ని ఇంటివద్దే పంపిణీ చేస్తారు. మొబైల్‌ ఆపరేటర్‌ (వాహనదారుడు) రోజూ ఉదయం బియ్యంతో పాటు ఈ–పాస్‌ యంత్రాన్ని రేషన్‌ డీలర్‌ నుంచి తీసుకోవాలి. ఆఖరులో మిగిలిన స్టాకుతో పాటు ఈ–పాస్‌ యంత్రాన్ని తిరిగి డీలర్‌కు అప్పగించాలి. ఆపరేటర్‌ రోజూ ఈ–పాస్‌ మిషన్‌లో తన హాజరును నమోదు చేసుకోవాలి. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీపై ఈ నెల 22, 23 తేదీల్లో మొబైల్‌ ఆపరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వాహనం వినియోగం, తూకం యంత్రం, డోర్‌ డెలివరీ తదితరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నెల 24 నుంచి 29 వరకు వాహన ఆపరేటర్లు, నోడల్‌ వీఆర్‌వోలు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని ఆదేశించారు. క్లస్టర్‌ పరిధిలోని రేషన్‌ డీలర్లు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి పరిచయం చేసుకోవాలి.

నిరుద్యోగ యువతకు ఉపాధి - Jobs for Unemployed People

బియ్యం, నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్‌ వాహనాలను రివర్స్‌ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000 కాగా రూ.3,48,600 సబ్సిడీగా అందించింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది.

apply-for-ration-delivery-vehicles-jobs

ఏ వర్గాలకు ఎన్ని వాహనాలు? 

  • ఎస్టీ కార్పొరేషన్‌  ద్వారా 700 
  • ఎస్సీ కార్పొరేషన్‌  ద్వారా 2,300 
  • బీసీ కార్పొరేషన్‌  ద్వారా 3,800 
  • మైనారిటీస్‌ కార్పొరేషన్‌  ద్వారా 660 
  • ఈబీ కార్పొరేషన్‌  ద్వారా 1,800

మొబైల్‌ వాహనంలో వసతులు ఇలా 

మొబైల్‌ వాహనంలో తూకం వేసే యంత్రం (వేయింగ్‌ స్కేల్‌), కొలతల పరికరాలు ఉంటాయి. ఎల్‌ఈడీ ల్యాంప్స్, ఈ–పాస్‌ యంత్రాల ఛార్జింగ్‌ పాయింట్లు, మినీ ఫ్యాన్, చిన్న మైక్‌ ఉంటుంది. ప్రథమ చికిత్స బాక్సు, నగదు పెట్టె, అగ్ని మాపక యంత్రం, నోటీసు బోర్డు ఏర్పాటు చే శారు. తూకం యంత్రం 12 నుంచి 18 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది.

రేషన్‌ సరఫరాలో కొత్త విధానం 

రేషన్‌ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి రావడంతో రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయే వారు. 

  • సరుకుల పరిమాణం, పంపిణీలో కోతలపై పలు ఫిర్యాదులు అందేవి. రేషన్‌ సరుకుల్లో కొత్త విధానం ఇలా... 
  • కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్‌ సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 
  • కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి కచ్చితమైన ఎలక్ట్రానిక్‌ తూకంతో పంపిణీ చేస్తారు. – వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే కార్డుదారుల వేలిముద్ర తీసుకుని నాణ్యమైన, కచ్చితమైన తూకం కలిగిన బియ్యాన్ని తిరిగి వినియోగించే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. 
  • కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకూ సీల్‌ ఉంటుంది, ప్రతి సంచికీ యూనిక్‌ కోడ్‌ వల్ల ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ జరుగుతుంది. అన్ని మొబైల్‌ వాహనాలకు జీపీఎస్‌ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్‌ యాప్‌ ద్వారా పంపిణీ వివరాలు రియల్‌ టైంలో తెలుసుకోవచ్చు. మొబైల్‌ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. దీనిపై నిరంతరం సోషల్‌ ఆడిట్‌ ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ తూకం ద్వారా కచ్ఛితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు.

సచివాలయాల ద్వారా బియ్యం కార్డుల సేవల వివరాలు (2020 జూన్‌ నుంచి ఇప్పటివరకు) 

  • కొత్త బియ్యం కార్డులు 4,93, 422 
  • కొత్త బియ్యం కార్డులలో సభ్యులను చేర్చడం  17,07,928 
  • కొత్త బియ్యం కార్డులను విభజించడం 4,38,013 
  • మొత్తం సేవలు  26,39,363

AP Grama Panchayat Election Schedule Dates | Local Body Election 2021

The Andhra Pradesh State Election Commission announced the schedule to conduct elections to gram panchayats in four phases beginning 05th February, 2021 after the High court verdict. The notification for the Election will be released on 23rd January, 2021. State Election Commissioner Nimmagadda Ramesh Kumar, announced the schedule hours after his meeting with Chief Secretary Aditya Nath Das and other top officials.

ap-grama-panchayat-election-schedule

AP Grama Panchayat Election Schedule | Local Body Election February, 2021 Dates

The notification for the first phase of gram Panchayat Elections will be issued on 23rd January, 2021 and polling held on 05th February, 2021 

For the second phase, the notification will be issued on 27th January, 2021 and polling on 09th February, 2021.

The third phase polling is scheduled for 13th February,2021 for which the notification will be issued on 31st January, 2021.

The final phase polling will be held on 17th February,2021 and the notification will be issued on the 4th February, 2021.

according to the SECs schedule. Ramesh Kumar said the model code of conduct would come into force from January 9 in accordance with the judgment of the Supreme Court.

Andhra Pradesh Local Body Election February, 2021 Dates

ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న మూడవ దశ పంచాయతీ ఎన్నికలు, అలాగే ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ( AP Local body elections 2021 schedule ) విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

Also, Read:

Wednesday, 20 January 2021

What is YSR App for Farmers in Andhra Pradesh?

YSR App Features and Uses 2021: Andhra Pradesh Government has taken all necessary steps to ensure more transparency and accountability among the staff who serves at the YSR Farmer Assurance Centers/ Rythu Bharosa Kendram (RBKs). On this page, you can find the YSR App Features, YSR App Uses and many more details. Let us have a look into the below sections of this page.

What is YSR App and How Farmers in Andhra Pradesh Can Use The App?

What is YSR App for Farmers in Andhra Pradesh?

Agriculture department of AP has built YSR mobile app for the village assistants deployed at Rythu Bharosa Kendrams (RBK). The App allows them to connect with the department for the dual purpose of keeping track of all assets that are deployed at a particular Rythu Bharosa Kendram and all the agriculture related activities that are being performed from time to time by village assistants. 

The main objective of YSR App is to help the Agriculture department track all the assets that are deployed at an individual Rythu Bharosa Kendram level and audit their current status and to record all the activities being performed at an individual Rythu Bharosa Kendram as part of the overall initiative.

Who will Use YSR App?

This App is basically designed for Village assistants to perform various activities as shown below.

  • Village assistants will login in to the App and frequently update the status of the assets available in the Rythu Bharosa Kenrdrams and Activities that are being performed in respective Rythu Bharosa Kendrams or Mandals.
  • Village assistants will be able to create the asset and edit the status of the assets. At the same time, village assistants will be able to create the activity, add descriptions about the activity and upload the images of the activity that was performed. 
  • All village assistants will be able to create multiple tasks under a particular activity and report to his corresponding manager. In the history tab, village assistants will be able to access past activities and tasks performed by him. A consolidated report is available for the village assistants to view the conditions of the assets that are deployed in their respective Rythu Bharosa Kendrams.

Uses of YSR App

  • The main purpose of the YSR app is to record everything from seed to sale and get real time results. Details of government schemes and programs in the field of agriculture and allied activities can be found through this app. After registering the RBK details of the employees through this app, the RBK building, assets, modern technical equipment and other equipment details should be entered in the digital stock register in the asset tracker. Problems in the use of equipment are set up to be resolved immediately. 
  • Programs such as crop details, crop cutting experiments, field demonstrations, visit to seed production fields, collection of soil samples for soil testing, YSR free crop insurance scheme, preparation of farmers for organic produce, distribution of input subsidy to farmers Register in this app from time to time. State Agriculture Commissioner Arun Kumar said the app was adding more features with the intention of bringing transparency in services and accountability among staff.
  • Accountability will be brought to the staff through the newly introduced Geofence in this app. Every day RBK has to upload a comprehensive analysis and pictures on the services provided to the farmers within five kilometers and the programs implemented. By doing this the RBK performance is assessed and graded. Thereby state level scoring is given for the performance of each Village Agriculture Assistant. RBK offers regular feedback on services and staff performance on the four pillars of 'very good, good, not good, not good'. Views are also collected for crop health, availability of produce, training for farmers and other needs. Steps will be taken to further improve the services accordingly.

YSR APP Features

YSR App has brought more features specially designed for Farmers. There are 10,641 RBKs in 660 zones in the state. There are 65 hubs and 13 district resource centers connected to them. An integrated call center has also been set up specifically for RBKs. Assistant to Agriculture, Horticulture, Silk, Fisheries and Animal Husbandry through RBKs, which became available from May 30 last year. 7,850 seed, 12,000 fertilizer and 1.21 lakh pesticide dealerships across the state are connected to these centers.

How to Download the App?

The app is available in Play store: Click Here To Download

What is Web hosting in Telugu వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?

Web hosting in Telugu: ఇది డిజిటల్ యుగం. ఇప్పుడు అందరూ తమ వ్యాపారాలను Online ద్వారా సేవలు అందించాలి అనుకుంటారు. అలాగే బ్లాగింగ్ మీద మక్కువ వున్నవాళ్లు తమ అభిప్రాయాలను ఆన్లైన్ వేదికల ద్వారా పంచుకోవాలని చూస్తారు. వీటన్నింటికి ఒక online application లేదా web app లేదా website అవసరం. మీ యొక్క files లేదా ఇతర డేటాను వెబ్సైటు రూపంలో పొందుపరచాలి అంటే  సర్వర్ హోస్టింగ్ తప్పనిసరి. అయితే హోస్టింగ్ అంటే ఏమిటి, హోస్టింగ్ ఎన్ని రకాలు, హోస్టింగ్ కొనే ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం.

What is web hosting in Telugu వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?

 వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?
మీ సరుకులను నిల్వ చేయడానికి మీకు ఒక గది లేదా స్థలం అవసరం ఉన్నట్లే, ఒక వెబ్‌సైట్‌ నిర్వహించాలంటే ఆన్‌లైన్‌లో వెబ్ హోస్టింగ్ అవసరం.

సింపుల్ గా చెప్పాలి అంటే - "వెబ్ హోస్టింగ్ మీ వెబ్‌సైట్ యొక్క డేటా ఫైల్‌లను online servers లో భద్రపరుస్తుంది". ఆ సర్వర్స్  ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ముఖ్యం.

వెబ్ హోస్టింగ్ ఎలా పని చేస్తుంది?

హోస్టింగ్ కంపెనీస్ మీ వెబ్‌సైట్ ఫైల్‌లను వెబ్ సర్వర్‌లలో నిల్వ చేస్తాయి. మీ వెబ్‌సైట్‌ను చూడటానికి ఎవరైనా వారి బ్రౌజర్‌లో URL ను టైపు చేసినప్పుడు, ఈ వెబ్ సర్వర్లు క్లయింట్ నుండి ఒక అభ్యర్థనను అంగీకరిస్తాయి మరియు మీ వెబ్‌సైట్ ఫైళ్ళ కాపీని వారి కంప్యూటర్‌కు పంపుతాయి, దాని ఫలితంగా మీ వెబ్‌సైట్  అంతర్జాలంలో అందుబాటులో ఉంటుంది.

వెబ్ హోస్టింగ్ కొనే ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు

  • మీ హోస్టింగ్ సర్వీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి, అంటే servers యొక్క up time గురించి తెలుసుకోవాలి

  • సర్వర్స్ యొక్క డేటా సెంటర్స్ లొకేషన్ మీ టార్గెట్ ఆడియన్స్ కు దగ్గర్లో ఉండటం మంచిది. అనగా మీ బ్లాగు భారతీయులకే పరిమితం అయితే, మీ బ్లాగు యొక్క వెబ్ హోస్టింగ్ కూడా భారత దేశంలో తీసుకోవటం మంచిది. దీని వల్ల latency తగ్గుతుంది

  • కొన్ని సార్లు మీ సర్వర్స్ యొక్క స్పీడ్ మీ బ్లాగు యొక్క ర్యాంకింగ్స్ ను పెంచుతుంది. కాబట్టి స్పీడ్ ఎక్కువ ఇచ్చే హోస్టింగ్ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి

  • మీ వెబ్ హోస్టింగ్ కంపెనీ  24/7 సపోర్ట్ ఇస్తుందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీ సర్వర్స్ down అయితే మీరు కాల్ చేసి కనుక్కునేలా ఉండాలి

  • వెబ్ హోస్టింగ్ కంపెనీల యొక్క రివ్యూస్ చదవటం మంచిది

  • అలాగే Online లో అందుబాటులో వుండే టూల్స్ ఉపయోగించి నేరుగా మీరే speed test, latency test వంటి సర్వర్ సంబంధిత విషయాలు తెలుసుకోవచ్చు

Types of Web Hosting in Telugu వెబ్ హోస్టింగ్ ఎన్ని రకాలు?

వెబ్ హోస్టింగ్ పరిశ్రమలో వివిధ రకాల హోస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి
  • Shared Server Hosting

  • WordPress హోస్టింగ్

  • డెడికేటెడ్ హోస్టింగ్

  • క్లౌడ్ హోస్టింగ్

  • వర్చువల్ ప్రైవేట్ సర్వర్ (VPS) హోస్టింగ్
మీరు ఏ రకమైన హోస్టింగ్ తీసుకోవాలి అనేది మీ వెబ్‌సైట్ యొక్క అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వెబ్‌సైట్ యొక్క వ్యాపారం, లావాదేవీలు, అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఆయా అవసరాల దృష్ట్యా మీ హోస్టింగ్ ఎంచుకోవాలి.

ఉదాహరణ: చిన్న వెబ్సైటు shared హోస్టింగ్ తో మొదలైతే, వ్యాపార రంగంలో వుండే వెబ్సైట్లు VPS హోస్టింగ్ సేవలు ఎంచుకుంటాయి.
what-is-web-hosting-in-telugu